హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులా మారిన పెనుబర్తి రైల్వే అండర్‌పాస్

SKLM: పొందూరు మండలం పెనుబర్తి రైల్వే అండర్ పాస్ వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు భారీగా చేరడంతో సుమారు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు తెలిపారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.