SKLM: కూరగాయలు విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని RTC బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అన్నంపేట రహదారిపై నిన్న ఈ ఘటన జరిగింది. లోలుగు గ్రామానికి చెందిన కన్నంనాయుడు(55) నిన్న తెల్లవారుజామున శ్రీకాకుళం బయలుదేరారు. శ్రీకాకుళం నుంచి పొందూరు వస్తున్న RTC బస్సు వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
RTC బస్సు ఢీకొని కూరగాయల వ్యాపారి మృతి


