హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య దూరమైందనే బాధతో ఆత్మహత్య

GNTR: కుటుంబ కలహాలతో భార్యకు దూరమైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు డీవీసీ కాలనీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. భవన నిర్మాణ కార్మికుడు బాణాల శంకరరావు(24) భార్యతో విభేదాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంటరితనం భరించలేక ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.