హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణదుర్గంలో మహిళా ఓటర్లదే పైచేయి!

ATP: కళ్యాణదుర్గం పురపాలక సంఘంలోని 32 వార్డుల ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 36,622 మంది ఓటర్లలో 17,597 మంది పురుషులు, 19,023 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,426 మంది అధికంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్ల నిర్ణయమే కీలకం కానుంది.