విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్హతలు కలిగిన వారు హాజరుకావచ్చన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళా.. భారీ జీతంలో ఉద్యోగాలు


