హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో పవిత్రోత్సవాలు

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యాగశాల శుద్ధి, అంకురార్పణ నిర్వహిస్తారు. 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు, మూలమంత్రాలతో పవిత్రీకరణ చేపడతారు. శనివారం మహా పూర్ణాహుతి, పవిత్ర ప్రదానం, మహదాశీర్వచనంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో అంజనారెడ్డి తెలిపారు.