హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్లలో కారం కొట్టి దారి దోపిడీ

ప్రకాశం: తర్లుపాడులోని పోతలపాడుకు చెందిన దంపతులను గానుగపెంట కొండ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు అడ్డుకుని దోపిడీకి పాల్పడ్డారు. మార్కాపురం నుంచి స్కూటీపై స్వగ్రామానికి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు కళ్లలో కారం చల్లి, రాజేశ్వరి మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. ఘటనపై బాధితులు తర్లుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.