హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూదం ఆడిన ఏడుగురు అరెస్ట్

ప్రకాశం: చీమకుర్తి తూర్పు బైపాస్ పక్కన పొలాల్లో జూదం ఆడుతున్న ఏడుగురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, జూద శిబిరాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దాసరి ప్రసాద్ హెచ్చరించారు.