హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో దంచికొడుతున్న వానలు

W.G: తీవ్ర వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రభావంతో ఉదయాన్నే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో సాధారణ జనజీవనం స్తంభించింది.