హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పాఠశాలలకు సెలవులపై కీలక ఆదేశాలు

ఏలూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో బుధవారం సూచించారు. డీవైఈవోలు, ఎంఈవోలు తమ పరిధిలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.