BPT: కర్లపాలెం మండలంలో ముసురు వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వర్షాలు ఆశలు కల్పించాయి. రెండు నెలలుగా నార్లు సిద్ధంగా ఉన్నా నీటి కొరతతో నాట్లు వేయలేకపోయారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకేసారి పనులు ప్రారంభం కావడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
ముసురుతో ఊపందుకున్న వ్యవసాయ పనులు


