SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భాద్రపద మాసం, శుక్లపక్ష ద్వాదశి పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి మహామంగళహారతి, నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
కేతకీ సంగమేశ్వర స్వామికి ద్వాదశి విశేష పూజలు!


