హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానుకుర్తి హైస్కూల్‌లో బాలికల క్రీడా పోటీలు

NRPT: దామరగిద్ద మండలం కానుకుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌-14, 17 బాలికల కబడ్డీ, ఖో-ఖో పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. సర్పంచ్‌ నారనోళ్ల నారాయణ, ఉపసర్పంచ్‌ యశోద పాల్గొని క్రీడాకారిణులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పీడీలు, పీఈటీలు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.