హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా బాసు నాయక్

MBNR: తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాజాపూర్ మండల అధ్యక్షుడిగా కాట్రావత్ బాసు నాయక్ నియమితులయ్యారు. ఈద్గాన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన నియామకంపై పలువురు అభినందించారు. ఫెడరేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బాసు నాయక్ తెలిపారు.