హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిర్పూర్ (టి)లో కోతుల బీభత్సం

ASF: సిర్పూర్ (టి) మండలంలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్ మొహల్లా గ్రామంలోని ఓ ఇంటి పెంకులు తొలగించి లోపలికి వచ్చిన కోతులు సరుకులను చిందరవందర చేశాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలాగే జరుగుతోందని, ఒక్కోసారి రూ.2-3 వేల నష్టం వస్తోందని బాధితుడు వాపోయాడు. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండటంతో పిల్లలు భయపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.