హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాయుగుండంపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

AKP: వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు కీలకమని హోంమంత్రి అనిత తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టి, SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని కోరారు.