ASR: తుఫాను ప్రభావంతో అనంతగిరి మండలంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనంతగిరి ఘాట్ రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న SI శంకర్‌రావు ఇవాళ ఉదయం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ వాహనంతో రహదారికి అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. రాకపోకలను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్టు.. స్పందించిన ఎస్సై


