AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మలయప్పస్వామి, సుదర్శన చక్రానికి స్నపన తిరుమంజనం నిర్వహించి పుష్కరిణిలోకి ప్రవేశపెట్టారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా, రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
భక్తి
శ్రీవారి చక్రస్నాన మహోత్సవం ప్రారంభం


