హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూచూరు జవాన్‌కు 'ఆర్మీ బలిదాన్' అవార్డు

MBNR: నవాబుపేట మండలం కూచూరుకు చెందిన దివంగత ఆర్మీ జవాన్ బీసీరెడ్డి యాదగిరి దేశసేవను గుర్తించి మరణానంతరం 'ఆర్మీ బలిదాన్ అవార్డు' ప్రకటించారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ఆర్మీ అధికారులు పురస్కారాన్ని అందజేయనున్నారు. యాదగిరి సతీమణి లలిత అవార్డును స్వీకరించనున్నారు. ఈ గౌరవం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.