హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి గట్కా పోటీలకు విద్యార్థి ఎంపిక

NZB: నందిపేట్ మండల కేంద్రంలో గల అక్షర హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న శంకుర్ సాయి హర్ష, అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి గట్కా క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. కుధన్‌పూర్ గ్రామానికి చెందిన విద్యార్థి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 'గట్కా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ' ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి అవకాశం సాధించాడు.