హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జలదంకిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

NLR: జలదంకిలోని పద్మావతి కళ్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేస్తారని తెలియజేశారు. నేతలు, కార్యకర్తలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.