హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంకెన్ డ్రైవ్‌లో 2 రోజుల జైలు శిక్ష

NDL: ప్యాపిలి మండలం జలదుర్గంలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులో మాధవరానికి చెందిన సుధాకర్ నాయుడుకు డోన్ కోర్టు 2 రోజుల జైలు శిక్ష విధించింది. స్పెషల్ జ్యుడీషియల్ II క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. నూరుల్లా తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు, జైలు శిక్ష, జరిమానాలు తప్పవని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు.