హైదరాబాద్: 28°C
తెలంగాణ

24గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

వినాయక నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉ.10 గం నుంచి రేపు ఉ. 10 గం వరకు మున్సిపాలిటీలతో పాటు సరిహద్దు నుంచి 2 km పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, డిపోలు మూసివేయాలని ఆదేశించారు.