హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విపరీత కరణి ఆసనం వల్ల కలిగే లాభాలు

రోజుకు 5 నిమిషాల పాటు విపరీత కరణి ఆసనం (గోడపై కాళ్లు పెట్టే భంగిమ) వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాళ్ల నుంచి గుండెకు రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మనసుకు విశ్రాంతినిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఆసనం వేస్తే గాఢమైన నిద్రపడుతుంది. ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లు, పాదాలలో వచ్చే వాపులు, నొప్పి తగ్గుతాయి.