హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోస్త్ చివరి విడత ప్రవేశాల షెడ్యూల్ విడుదల

SDPT: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు దోస్త్ చివరి విడత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 24, 25 తేదీల్లో జరుగుతుందని సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు చేపడతామన్నారు. ఇంకా సీటు పొందని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.