హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లి ప్రేమ... ఉద్యోగ బాధ్యత

MDCL: మేడ్చల్ పోస్టాఫీసు ఉద్యోగిని మమత తన అంకితభావంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఆమె, తన 10 నెలల బాబును భుజానికేసుకుని ఇంటింటికీ వెళ్లి పోస్టులు అందజేస్తున్నారు. ఒకవైపు తల్లిగా మమకారాన్ని, మరోవైపు ఉద్యోగిగా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.