హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు వైసీపీ సిద్ధం

BPT: రానున్న పంచాయతీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సన్నద్ధం కావాలని చీరాల ఇంఛార్జ్ కరణం వెంకటేష్ బాబు పిలుపునిచ్చారు. వేటపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, బీరక సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.