హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి'

ASR: పెదబయలు మండలం కుంతుర్ల, కిముడుపల్లి పంచాయతీల మధ్య ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని కిముడుపల్లి ఎంపీటీసీ సభ్యుడు పాంగి రామారావు, వార్డు సభ్యులు పాంగి అప్పలకొండ, పాంగి ఏసుబాబు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో వినతులు ఇచ్చినా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. బ్రిడ్జి నిర్మిస్తే రెండు పంచాయతీలకు మేలు జరుగుతుందన్నారు.