హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పాఠశాలలకు సెలవు

ASR: భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వసతి పాఠశాలల విద్యార్థులను బయటకు వెళ్లనివ్వకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.