హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఉచిత రక్త పరీక్షలు

TPT: నాయుడుపేట ఎల్.ఎ. సాగరం పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత నివారణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం, ఎంఈఓ మాధవీలత ఆధ్వర్యంలో 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.