హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న JCB

CTR: కుప్పం పట్టణం ప్యాలెస్ రోడ్డులోని వికాస్ కళాశాల సమీపంలో డ్రైనేజీ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు జేసీబీ తగలడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్ కాలువలో పడిపోవడంతో షార్ట్‌సర్క్యూట్ అయి భారీ శబ్దం వచ్చింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.