VZM: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎస్పీ దామోదర్ మంగళవారం సూచించారు. లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు, కాలువల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీటిలో రోడ్లు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112 లేదా కంట్రోల్ రూమ్ 9121109483కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ నెంబర్లకు కాల్ చేయండి'


