సత్యసాయి: ఈనెల 24న బుక్కపట్నం ఎస్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు జీతం లభిస్తుంది. ఆసక్తి గలవారు నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 25000 జీతంతో 24న జాబ్ మేళా


