హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుపాంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేసేందుకు మంగళవారం కురుపాం మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీ పెరిగిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.