ATP: జిల్లా నుంచి అండర్-19 స్టేట్ క్రికెట్ టీమ్‌కు ఎంపికైన తలారి కిరణ్ కుమార్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ కలెక్టరేట్‌లో అభినందించారు. పేద కుటుంబం నుంచి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. కిరణ్ భవిష్యత్ కోసం వయోజన విద్యాశాఖ డీడీ వెంకటేశ్వర్లు, సిబ్బంది సమకూర్చిన రూ.1,39,000 చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందించారు.
ఆంధ్రప్రదేశ్
అండర్-19 క్రికెట్‌కు ఎంపిక.. కలెక్టర్ అభినందనలు


