హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'MSME పార్కు కోసం భూములు సేకరించాలి'

CTR: జీడీనెల్లూరులో MSME ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ తొలుత 432 ఎకరాల భూమిని సర్వే చేసింది. ఇందులో 73.18 ఎకరాలను మాత్రమే సేకరించి రైతులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందించింది. మిగతా రైతులు కూడా తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తగిన పరిహారం అందించి మిగిలిన భూములను సేకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.