ASR: భారీ వర్షాల నేపథ్యంలో చింతపల్లి మండలం తాజంగి రిజర్వాయర్ నీటి నిల్వ, విడుదల వ్యవస్థలను జలవనరుల శాఖ ఎస్‌ఎంఐ ఈఈ రాజేంద్రకుమార్ మంగళవారం పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు తూముల ద్వారా 167 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా పర్యవేక్షిస్తున్నామన్నారు. నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్‌పై అధికారుల పరిశీలన


