కోనసీమ: అమలాపురం చుట్టుపక్కల జాతీయ రహదారిపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు మంగళవారం దాడి నిర్వహించారు. పేరూరు వై. జంక్షన్, పాసర్లపూడి, వద్ద అనధికారికంగా నిలిపి ఉంచిన 15 వాహనాలపై కేసు నమోదు చేసి, రూ.45,509 ఫైన్ విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వీటిపై భద్రతా ఉల్లంఘనల కేసు నమోదు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై నిలిపిన వాహనాలపై రవాణా శాఖ దాడులు


