అన్నమయ్య: రైల్వేకోడూరు ఏఐటీయూసీ కార్యాలయంలో అంగన్వాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నంద్యాల సరోజనమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000తో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీసం రూ.36 వేల వేతనం ఇవ్వాలని, అంగన్వాడీలకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీలకు కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలి'


