హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతమ్మ ఆలయాన్ని సందర్శించిన కమిషనర్

NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భక్తుల సౌకర్యాలు, లడ్డూ తయారీ కేంద్రం, అన్న ప్రసాద వితరణను పరిశీలించారు.