హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పర్యటించనున్న బాలల హక్కుల కమిషన్

ATP: ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్లా మధుసూదన్ రావు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తొలిరోజు హాస్టళ్లు, ICDS, కేజీబీవీలు, హెల్త్ సెంటర్లు తనిఖీ చేస్తారు. రెండో రోజు పాఠశాలలు పరిశీలించి, కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు.