హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ సచివాలయాల పేరు మార్పుపై వైసీపీ విమర్శలు

అన్నమయ్య: గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుగా పేరు మార్చడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థకు పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాయచోటి నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కృషితో సచివాలయాలు, ఆర్బీకేలు,వేగంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.