హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AIIB తాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం  AIIB ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పైప్‌లైన్,వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రిజర్వాయర్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.