హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం

ASR: పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ రాసగుప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం ప్రారంభించారు. రూ.10 లక్షల నిధులతో నిర్మించిన భవనాన్ని కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.