AKP: మిడ్‌డే మీల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 26న ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని మిడ్ డే మీల్ యూనియన్ నాయకులు కే.ప్రసన్న తెలిపారు. నర్సీపట్నం సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. నాలుగు నెలలుగా మెనూ ఛార్జీలు, పారితోషకాలు చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుల సమస్యల పరిష్కరించాలి'


