హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబితాలో మీ పేరు ఉందా.. ?

NTR: నందిగామ పురపాలక సంఘంలోని 32 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను వర్గాల వారీగా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, మహిళలు, బీసీ వర్గాల వారీగా విభజించిన జాబితాలను సోమవారం మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.