ప్రకాశం: పెద్దచర్లపల్లి (మం) పెద్ద ఇర్లపాడు సచివాలయం వద్ద మంగళవారం మహిళలు మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ.. నిరసన చేపట్టారు. బల్లివారిపల్లి, పాలూరువారిపల్లిలో ఆరు నెలలుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ రూ.15 లక్షల నిధులు తీసుకువచ్చినా పనులు ప్రారంభించలేదని వెంటనే పనులు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి సమస్యపై మహిళల నిరసన


