హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

TPT: వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల ప్రస్తావన మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రూ.41 కోట్లతో పట్టణ రహదారులు, రూ.9 కోట్లతో గ్రామీణ రోడ్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధిపై చర్చకు రావాలని ఆమె అన్నారు.