హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రూ. 10 కోట్లతో తాగునీటి పథకం ఆధునీకరణ'

KKD: పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లిలో సుమారు రూ. 10 కోట్లతో ఆధునీకరించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార నిధులతో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు నీటి సరఫరా నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.