హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండ్లోపల్లిలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ప్రకాశం: వెలిగండ్ల (మం) గన్నవరం పంచాయతీ పరిధిలోని గండ్లోపల్లిలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రియ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో టీ. శిల్ప, ఆర్‌ఎస్‌కే సిబ్బంది సయ్యద్ షారుక్ తదితరులు పాల్గొన్నారు.